Thursday, March 20, 2025
HomeTrending Newsఅగ్నిసాక్షిగా నరేష్-పవిత్ర వివాహం

అగ్నిసాక్షిగా నరేష్-పవిత్ర వివాహం

కొంతకాలంగా సహజీవనంలో ఉన్న నటులు నరేష్- పవిత్ర అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వీరి వివాహం జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన 40 సెకన్ల వీడియో ను టీం నరేష్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.

 

తాము త్వరలో ఒక్కటవబోతున్నట్లు  పవిత్రతో కలిసి చేసిన ఓ వీడియో ను నరేష్ గత డిసెంబర్ 31న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తన మూడో భార్యతో వివాదం నడుస్తున్నందున పెళ్లి తేదీ విషయమై ఎలాంటి బహిరంగ ప్రకటనా చేయలేదు. కానీ ఒకేసారి పెళ్లి తంతు పూర్తయినట్లు వీడియో నేడు బైటికి రావడం సంచలనం కలిగించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్