నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అనుబంధ సంస్థలకు విరాళాలు ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసలు పంపింది. ఈడీ నోటీసులు అందుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు అందిందని, ఈ క్రమంలోనే మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ తదితరులు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయ సంబంధింత అంశాలను రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు వివరించే అవకాశం ఉంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి ఎదుట, మీడియాతో ఏ విధంగా వ్యవహరించాలో వివరించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇకపోతే… రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే బీజేపీ నాయకులు ఈడీని ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read : నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు