Sunday, March 15, 2026
Homeసినిమానిజాయితీ గెలిచింది : నట్టికుమార్

నిజాయితీ గెలిచింది : నట్టికుమార్

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్ల టికెట్ రేట్లను నిర్ణయిస్తూ తీసుకుని వచ్చిన జీవో 35 అమలు అంశంపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ వేసిన పిటిషన్ కు అనుకూలంగా వెంటనే ఆ జీవోని అధికారులు అమలుపరచాలంటూ ఏపీలోని అమరావతి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నం జిల్లాలోని కొంతమంది థియేటర్ల యజమాన్యాలు ఈ జీవోను అమలు చేయకుండా, తమ ఇస్టానుసారం అధిక రేట్లకు బహిరంగంగా బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతూ ప్రేక్షకుల సొమ్ము దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారంటూ నట్టికుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని…తక్షణమే ఈ అన్యాయం, దోపిడీపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. సోమవారం దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీవో 35 ని అమలు పరచాలంటూ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్, అనకాపల్లి ఆర్డీవోకి మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందని నట్టికుమార్ మీడియాకు తెలిపారు.

కొంతమంది థియేటర్ యజమాన్యాలు, ఒక బడా నిర్మాత, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ అయిన ఒక వ్యక్తితో కుమ్మకై వ్యవహరించినప్పటికీ నిజాయితీనే గెలిచిందని నట్టికుమార్ వెల్లడిస్తూ, ఆ ఆర్డీవో పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular