Friday, March 20, 2026
Homeసినిమానాని హీరోగా ‘దసరా’

నాని హీరోగా ‘దసరా’

నేచురల్ స్టార్ నాని చేసే ప్రతీ సినిమా, ఎంచుకునే ప్రతీ పాత్ర కొత్తగానే ఉంటుంది. అయితే.. ఇప్పుడు నాని ఎంచుకున్న కారెక్టర్ మాత్రం ఇది వరకు ఎన్నడూ చూడనిది. ఈ దసరా సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ తో నాని అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతోన్న నాని కొత్త సినిమాకు దసరా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు పొందిన మహానటి కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

దసరా సందర్భంగా పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని నేపథ్యం, కాన్సెప్ట్‌ ఎలా ఉంటుందో ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఇందులో నాని, కీర్తి సురేష్ లుక్ ఎలా ఉంటుందో చూపించారు. ఒకప్పటి కాలంలోని రైళ్లు, ఆ ట్రాక్, బతుకమ్మ పాట ఇలా అన్నింటిని చూస్తుంటే ఇది పక్కా తెలంగాణ భాష, యాసలో తెరకెక్కిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక చివర్లో నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఈ చిత్రం గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని ఇది వరకు ఎన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు.

సముద్రఖని, సాయి కుమార్, జరినా వాహబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్వయహరిస్తున్నారు. విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దసరా యూనిట్‌కు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular