Saturday, January 18, 2025
Homeసినిమావిజ‌య‌శాంతి నో చెబితేనే...

విజ‌య‌శాంతి నో చెబితేనే…

Vijaya Shanthi: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాద‌ర్. ఇది మ‌ల‌యాళంలో విజయం సాధించిన లూసీఫ‌ర్ మూవీకి రీమేక్. మోహ‌న్ రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ టీజ‌ర్ సినిమా పై అంచ‌నాలు పెంచేసాయి. దీనికి తోడు ఇందులో బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్, పూరి జ‌గ‌న్నాథ్ గెస్ట్ రోల్స్ చేస్తుండ‌డంతో గాడ్ ఫాద‌ర్ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ ముఖ్య‌పాత్ర‌ను సీనియ‌ర్ హీరోయిన్ విజ‌య‌శాంతితో చేయించాలి అనుకున్నార‌ట‌. అయితే.. విజ‌య‌శాంతిని కాంటాక్ట్ చేస్తే.. నో చెప్పింద‌ట‌. ఆత‌ర్వాత శోభ‌న‌తో అయినా చేయించాలి అనుకున్నార‌ట‌. ఆమె కూడా నో చెబితే ఫైన‌ల్ గా న‌య‌న‌తార‌తో ఆ పాత్ర‌ను చేయిస్తున్నార‌ట‌. మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే.. చిరంజీవి, బాబీ డైరెక్ష‌న్ లో వాల్తేరు వీర‌య్య అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో కూడా ఓ కీల‌క పాత్ర ఉంద‌ట‌. ఆ పాత్ర‌ను కూడా ఓ సీనియ‌ర్ హీరోయిన్ తో చేయించాల‌ని ట్రై చేస్తున్నార‌ట‌. సుమ‌ల‌త పేరు గ‌ట్టిగా వినిపిస్తుంది. సుమ‌ల‌త మ‌రి ఈ సినిమాలో న‌టించేందుకు ఓకే చెబుతుందో నో చెబుతుందో అనేది ఆస‌క్తిగా మారింది. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. మొత్తానికి చిరంజీవి తన సినిమాల్లో గ‌తంలో త‌న‌తో న‌టించిన హీరోయిన్స్ తో కీల‌క పాత్ర చేయించాలి అనుకుంటున్నారు. మ‌రి.. ఏ హీరోయిన్ ఓకే చెబుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్