Wednesday, March 11, 2026
Homeసినిమానయనతారకి తగ్గని డిమాండ్!  

నయనతారకి తగ్గని డిమాండ్!  

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతారకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా .. మరో వైపున లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె బిజీగానే ఉంటోంది. ఈ మధ్య కాలంలో సౌత్ లో ఈ స్థాయి క్రేజ్ ను అందుకున్న హీరోయిన్ మరొకరు లేరు. నయనతార ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలమవుతున్నా, ఆమె మార్కెట్ ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషం. సీనియర్ స్టార్ హీరోల సినిమాల నుంచి ఆమెను వెతుక్కుంటూ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తమిళంలో మాత్రమే కాదు .. తెలుగు నుంచి కూడా ఆమె డేట్స్ కోసం మేకర్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు.

తెలుగులో ఇంతవరకూ బాలకృష్ణ సరసన నయనతార ఎక్కువ సినిమాలు చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు చాలా వరకూ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ జోడీ కట్టనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ సినిమాను చేస్తున్న బాలకృష్ణ, ఆ తరువాత సినిమాను బాబీ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను సంప్రదించారనే ప్రచారం జరుగుతోంది.

ఇక చిరంజీవి చేయనున్న మరో ప్రాజెక్టు కోసం కూడా నయనతారను  అడుగుతున్నట్టుగా చెబుతున్నారు. శ్రీవశిష్ఠ దర్శకత్వంలోను .. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోను ఆల్రెడీ చిరంజీవి రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. ఈ రెండు సినిమాలకి సంబంధించి కథానాయికలుగా త్రిష – తమన్నా పేర్లు తెరపైకి వచ్చాయి. మరో ప్రాజెక్టులో హీరోయిన్ గా నయనతార కనిపించనుందని అంటున్నారు. అది ఏ ప్రాజెక్టు అనే విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా చూస్తుంటే నయన్ డిమాండ్ ఎంతమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular