Saturday, January 18, 2025
Homeసినిమాచిరు గాడ్ ఫాద‌ర్ లేటెస్ట్ అప్ డేట్

చిరు గాడ్ ఫాద‌ర్ లేటెస్ట్ అప్ డేట్

Nayan Schedule: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం గాడ్ ఫాద‌ర్. ఇది మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన లూసీఫ‌ర్ మూవీకి అఫిషియ‌ల్ రీమేక్. ఇందులో అందాల తార‌ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ ఈ మూవీ గురించి ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా అప్ డేట్ ఇచ్చారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే…  నయనతార పై ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసానని.. వరుసగా మూడోసారి ఆమెతో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతే కాకుండా… న‌య‌న‌తార‌తో కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ భారీ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

Also Read : ‘గాడ్ ఫాదర్’ లో నయనతార

RELATED ARTICLES

Most Popular

న్యూస్