Sunday, January 19, 2025
Homeసినిమాబాలకృష్ణ 109వ చిత్రం ప్రారంభం..

బాలకృష్ణ 109వ చిత్రం ప్రారంభం..

బాలకృష్ణ తన కొత్త మూవీకి కొబ్బరికాయ కొట్టారు. ‘ఎన్‍బీకే 109’ మూవీకి నేడు పూజ జరిగింది. బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించనున్నారు.బాలకృష్ణ చాలా జోష్‍లో ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డితో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ మూవీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పుట్టిన రోజు సందర్భంగా నేడు జూన్ 10 మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు బాలకృష్ణ. ఈ కొత్త మూవీ పూజ నేడు జరిగింది. బాలకృష్ణ 109వ సినిమా గా ఇది ఉండనుంది. వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర).. బాలయ్య 109వ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఎన్‍బీకే 109 అంటూ చిత్రయూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. వయిలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అంటూ పేర్కొంది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లు నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మాతలుగా ఉన్నారు.బాబీ డైరెక్టర్ గా ఉన్న ఈ ఎన్‍బీకే 109 ప్రాజెక్టు గురించి సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది. గొడ్డలి, కత్తులు, సుత్తులు సహా కొన్ని ఆయుధాలు ఉన్న బాక్స్ లాంటి లుక్‍ను పోస్ట్ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్