Saturday, January 18, 2025
Homeసినిమానాగ చైతన్య క్రియేటివ్ టీమ్ ని ప్రకటించిన మేకర్స్

నాగ చైతన్య క్రియేటివ్ టీమ్ ని ప్రకటించిన మేకర్స్

అక్కినేని నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్‌  ప్రారంభమైంది. ఈ చిత్రానికి NC22 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. చైతన్య తొలి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రమిది. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి  హీరోయిన్ గా నటిస్తోంది. వెంకట్ ప్రభుకి ఇది తొలి తెలుగు చిత్రం. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌లో వచ్చే స్వరాలపై ఎన్నో అంచనాలున్నాయి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా వేసిన సెట్లో షూటింగ్ ప్రారంభమైంది.

ఈ చిత్రానికి… సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్; డైలాగ్ రైటర్: అబ్బూరి రవి; ఎడిటింగ్:  వెంకట్ రాజన్; ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్‌; ఆర్ట్ డైరెక్టర్: డి.సత్యనారాయణ; యాక్షన్ డైరెక్టర్స్: యాన్నిక్ బెన్, మహేష్ మాథ్యూ; సమర్పణ:పవన్‌కుమార్‌. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్