Tuesday, March 10, 2026
Homeసినిమాఈ నెలలోనే ‘నీ జతగా’...

ఈ నెలలోనే ‘నీ జతగా’…

శ్రీ సుబంద్రా క్రియేషన్స్ బ్యానర్ పై భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్,దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా,బాషా తదితర తారాగణంతో భమిడిపాటి వీర దర్శకత్వంలో రామ్ బి నిర్మిస్తున్న సినిమా ‘నీ జతగా’. ఈ చిత్రం ఈ సెప్టెంబర్ లో  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ భమిడిపాటి వీర మాట్లాడుతూ.. మా టీజర్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన లభిచింది, అలాగే మా మూవీ లోని సాంగ్స్ అనంత్ శ్రీరామ్ గారు రాయటం అలాగే ఒక సాంగ్ ను రిలీజ్ చేసినందుకు అనంత్ శ్రీరామ్ గారికి అనురాగ్ కులకర్ణి కి కూడా ధన్యవాదాలు అని తెలిపారు.

ప్రొడ్యూసర్ రామ్.బి మాట్లాడుతూ… గతం లో మా సినిమా టీజర్ కి మంచి స్పందన లభించింది, అనంత్ శ్రీరామ్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. అందరూ  ఆదరిస్తారు అని కోరుకుంటున్నాం, ఇక పోతే ఈ సినిమా మా డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించటం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమా మీద చాలా నమ్మకంతో వున్నారు. అందువలన ఇలాంటి కోవిడ్ సిట్యుయేషన్ లో మాకు ఇది ఒక శుభసూచకంగా భావిస్తున్నాం. మా సినిమాని తప్పకుండా ఆదరిస్తారు అని ఆశిస్తున్నాం” అన్నారు.

ఈ మూవీలో ఇదే ఇదే సాంగ్ రాసిన అనంత్ శ్రీ రామ్ మాట్లాడుతూ “ఈ సాంగ్ యొక్క సారాంశాన్ని చాలా క్లుప్తంగా వివరించారు, ప్రయాణం, జీవితం ఒకే చోట మొదలయినప్పుడు ట్రక్కింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సాంగ్ మొదలు అవుతుంది, ఈ సాంగ్ లో పకృతి గురించి చాలా ఆహ్లాదకరమయిన పదాలు జోడించి ఈ సాంగ్ రాయటం జరిగింది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular