కె రహేజా గ్రూప్ విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మిస్తోంది. మొత్తంగా మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజా భేటీ అయ్యారు. ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని వారు సిఎంకు తెలియజేశారు.
నీల్ రహేజాతో పాటు ఇనార్బిట్ మాల్స్ సీఈఓ రజనీష్ మహాజన్, కె రహేజా గ్రూప్ ఆంధ్రా, తెలంగాణా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె శ్రావణ్ కుమార్ కూడా సిఎంను కలిసిన వారిలో ఉన్నారు. పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్‌లు కూడా ఈ భేటీకి హాజరయ్యారు