రాష్ట్రంల్ 10వ తరగతి పరీక్షలు నేటినుండి ప్రారంభమయ్యాయి, అయితే పరీక్షకు సంబంధిత ప్రశ్న పాత్రలు పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచుతారు. పరీక్షకు 30నిమిషాల ముందు సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ ప్రొటెక్షన్ తో పరీక్ష ప్రశ్న పత్రాలను జాగ్రత్త గా సెంటర్ లోకి తీసుకువస్తారు. కానీ హైద్రాబాద్ రాంకోట్ అలెన్ స్కూల్ పరీక్ష సెంటర్ లో నిర్లక్షంగా కనీస పోలీస్ భద్రత లేకుండా ఒక అటెండర్ తో పోలీస్ స్టేషన్ నుండి కాలి నడకతో పరీక్ష ప్రశ్న పాత్రలు తెప్పించారు,
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారం చల్లారాక ముందే మరో ప్రశ్న పత్రాల నిర్లక్ష్యం బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు వ్యవస్థని తప్పుపడుతున్న 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా భద్రత లేకుండా ప్రశ్న పత్రాలు కాలి నడకన తీసుకువస్తే , దారి మధ్యాలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు, ఒక్క చిన్న నిర్లక్ష్యం పరీక్ష రాసే పిల్లలపై ఎంతో భారం పడుతుంది. ఇలా నిర్లక్యం మళ్ళీ జరగకుండా అటు ప్రభుత్వం ఇటు పోలీసులు చర్యలు తీసుకోవాలని 10వ తరగతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు,
Also Read : విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు: బొత్స