Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్నెల్లూరు పర్యాటకం గుర్తించండి

నెల్లూరు పర్యాటకం గుర్తించండి

నెల్లూరు జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి నెల్లూరు లోక్ సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ కార్యాలయంలో కిషన్ రెడ్డిని ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కిషన్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ హోదాకు ఉన్నతిని పొందిన సందర్భంగా ఆయనను కలిసి సన్మానం చేశారు.

అనంతరం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కోట, కోడూరు, మైపాడు బీచ్ లతో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.  కిషన్ రెడ్డి ఇందుకు సానుకూలంగా స్పందించి తన సమ్మతిని తెలియజేశారు. సాధ్యమైనంతవరకు నిధుల కేటాయింపునకు కృషి చేస్తానని ఆదాల ప్రభాకర్ రెడ్డికి  హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్