Sunday, January 19, 2025
Homeసినిమా'పుష్ప 2' దిమ్మ దిరిగే ఓటీటీ రేటు!

‘పుష్ప 2’ దిమ్మ దిరిగే ఓటీటీ రేటు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2, పుష్ప చిత్రాలు రూపొందాయి. అయితే… ఆర్య, ఆర్య 2 చిత్రాలు ఒక ఎత్తు అయితే.. పుష్ప మరో ఎత్తు అని చెప్పచ్చు. పుష్ప సినిమా అటు బన్నీ, ఇటు సుక్కు ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీనే. ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో పుష్ప 2 కోసం సౌత్ జనాలే కాదు.. నార్త్ జనాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఇటీవలే వైజాగ్, హైదరాబాద్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంది.

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ సర్కిల్ లో క్రేజ్ కూడా పెరుగుతుంది.  దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది.  మేకర్స్ ఓటీటీ కోసం 200 కోట్లు అడుగుతున్నారట. నెట్ ఫ్లిక్స్ అంత అమౌంట్ ఇచ్చేందుకు కూడా రెడీగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే.. పుష్ప 2 ఓటీటీలో భారీ రేటుతో సరికొత్త రికార్డ్ సెట్ చేయడం ఖాయం.

ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పరంగా ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా నిర్మిస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : ‘పుష్ప 2’ లో ఫిదా బ్యూటీ నిజమేనా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్