Wednesday, September 25, 2024
HomeTrending Newsతెలంగాణలో మరిన్ని కొత్త మండలాలు

తెలంగాణలో మరిన్ని కొత్త మండలాలు

పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి దార్శనికతతో ఇప్పటికే నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో.. సిఎం ఆదేశాలమేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయా జిల్లాల్లోని రెవిన్యూడివిజన్ల పరిథిల్లో ఏర్పాటయిన నూతన మండలాలు :
• నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్ (gundumal) , కొత్తపల్లె(kothapalle) మండలాలు.
• వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ (dudyal) మండలం.
• మహబూబ్ నగర్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..కౌకుంట్ల (koukuntla) మండలం.
• నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిథిలో..ఆలూర్ (aloor), డొంకేశ్వర్(donkeshwear) మండలాలు.
• నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిథిలో,, సాలూర(saloora) మండలం.
• మహబూబాబాద్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిథిలో..సీరోల్(seerole) మండలం.
• నల్లగొండ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిథిలో…గట్టుప్పల్(gattuppal) మండలం
• సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో…నిజాం పేట్ (nizampet) మండలం.
• కామారెడ్డి జిల్లాలోని, బాన్స్ వాడ రెవిన్యూ డివిజన్ పరిథిలో.. డోంగ్లి (dongli) మండలం.
• జగిత్యాల జిల్లా/జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిథిలో.. ఎండపల్లి(endapally) మండలం., జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిథిలో, భీమారం(bheemaram) మండలం.

పైన పేర్కొన్న నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్