Sunday, November 24, 2024
HomeTrending NewsPaddy Procurement: ధాన్యం సేకరణకు సరికొత్త విధానం: సిఎం జగన్

Paddy Procurement: ధాన్యం సేకరణకు సరికొత్త విధానం: సిఎం జగన్

రైతులకు కనీస మద్దతు ధర కన్నా ఒక్కపైసా కూడా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో ధాన్యం సేకరణలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆన్నారు. తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశామన్నారు.  కొత్తవిధానం ఎలా అమలవుతున్నదీ గమనించుకుంటూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖరీప్‌ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు:

  • ధాన్యంసేకరణపై ముందస్తు అంచనాలు వేసుకుని, ఆ మేరకు గోనెసంచులు అందుబాటులోకి తీసుకురావాలి
  • రవాణా, లేబర్‌ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో జవాబుదారీతనం ఉండాలి
  • రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయం రైతులకు తెలియాలి
  • రైతులకు చేస్తున్న చెల్లింపులన్నీ కూడా అత్యంత పారదర్శకంగా ఉండాలి
  • ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్‌ నుంచి వారికి డబ్బు చేరేలా చర్యలు తీసుకోవాలి
  • ధాన్యం సేకరణకోసం తయారు చేసిన యాప్‌లో.. సిగ్నల్స్‌ సమస్యల వల్ల అక్కడడక్కగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
  • ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదుచేసుకుని, సిగ్నల్‌ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోకి లోడ్‌ అయ్యేలా మార్పులు చేసుకోవాలి
  • అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నాం. ఆ శాఖల నుంచి తగిన సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలి
  • ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై సమాచారాన్ని సమగ్రంగా తెలియజేసేలా ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టాలి, దీనివల్ల రైతుల్లో అవగాహన కలుగుతుంది
  • రైతుల ఫోన్లకూ ఈ సమాచారాన్ని ఆడియో, వీడియో రూపంలో పంపించాలి
  • ధాన్యం సేకరణకోసం అనుసరిస్తున్న సరికొత్త విధానం, ఈ ప్రక్రియలో ఏమేం చేస్తున్నామన్న దానిపై సంపూర్ణం సమాచారం వారికి చేరవేయాలి
  • పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ల విధులపై ఎస్‌ఓపీలను తయారుచేయాలి
  • అవకతవకలకు, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ఎస్‌ఓపీలు ఉండాలి:
  • రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగుమీదకూడా రైతులకు అవగాహన కలిగించాలి,  అలాంటి రైతులను ప్రోత్సహించాలి
  • మన ప్రభుత్వం వచ్చాక మిల్లెట్స్‌ సాగును ప్రోత్సహిస్తున్నాం
  • ఎవరైనా మిల్లెట్స్‌ కావాలి అని అడిగితే, వాటిని వినియోగిస్తామని కోరితే పౌరసరఫరాల శాఖ ద్వారా వారికి అందించాలి

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌చైర్మన్‌ ఎంవియస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్‌ ప్రద్యుమ్న, పౌరసరఫరాలశాఖ కార్యదర్శి హెచ్‌ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి హరికిరణ్, మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ రాహుల్‌ పాండే, పౌరసరఫరాల డైరక్టర్‌ విజయ సునీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Also Read :  చేతగాకపొతే FCIకి అప్పచెప్పండి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్