Sunday, January 19, 2025
Homeసినిమా‘సర్కారు...' నుంచి సరికొత్త పోస్టర్

‘సర్కారు…’ నుంచి సరికొత్త పోస్టర్

New Poster: సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌‘. ఈ భారీ చిత్రానికి ‘గీత గోవిందం’ ఫేమ్ ప‌ర‌శురాం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టిస్తుంది. మ‌హా శివరాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సినిమాలోని యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను తెలియచేసేలా ఈ పోస్ట‌ర్ ఉంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్స్ పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుద‌లైన క‌ళావ‌తి.. సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ పాట 50 మిలియ‌న్స్ కు పైగా వ్యూస్‌ను రాబ‌ట్టుకోవ‌డం విశేషం. ఈ భారీ చిత్రాన్ని మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్