ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆచార్య సినమా ప్లాప్ అవ్వడంతో కొరటాలను కథ పై మరోసారి వర్క్ చేయమని సలహా ఇచ్చారు ఎన్టీఆర్. అప్పటి నుంచి కొరటాల కథ పై కసరత్తు చేస్తునే ఉన్నారు. కథ ఇంకా రెడీ కాకపోవడంతో ఇప్పటి వరకు ఎన్టీఆర్, కొరటాల మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ భారీ, క్రేజీ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే… ఆర్ఆర్ఆర్ తరువాత పాన్ ఇండియా కథతో సినిమా చేయాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. అందుకే అంతకు ముందు అనుకున్న కథను పక్కన పెట్టారు. తన దగ్గర వున్న ఓ కొత్త పాయింట్ తో పాన్ ఇండియా లెవెల్ స్టోరీని కొరటాల తయారు చేస్తున్నారు. ఈ కథ రెడీ కాగానే సెట్ మీదకు వెళ్తారు.
నవంబర్ నుంచి ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా షూట్ వుండొచ్చని తెలుస్తోంది. ఈ కథ కొంత భాగం సముద్రం మీద, షిప్ ల మీద కూడా నడుస్తుందని సమాచారం. కథలో మాఫియా బ్యాక్ డ్రాప్ వుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ వింటూ వుంటే కొరటాల తను చేయబోయే ఎన్టీఆర్ సినిమా కోసం భారీ బ్యాక్ డ్రాప్ నే రెడీ చేసినట్లు కనిపిస్తోంది. మరి.. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.
Also Read : ఎన్టీఆర్, కొరటాల మూవీ మరింత ఆలస్యం కానుందా.?