Sunday, February 23, 2025
HomeTrending Newsకొలువుదీరిన కొత్త శాసనసభ

కొలువుదీరిన కొత్త శాసనసభ

ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభ నేడుతొలిసారి కొలువు తీరింది. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.  మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  తరువాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సభ్యులుగా ప్రమాణం చేశారు. అనంతరం అక్షర క్రమంలో మంత్రులు… తదనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…. మహిళా సభ్యులు ప్రమాణం చేశారు.

తొలుత ప్రొటెం స్పీకర్‌ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి  స్పీకర్ స్థానాన్ని అధిష్టించారు. అనతరం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైంది. ఈరోజు సభ్యుల ప్రమాణం పూర్తి చేసి శాసనసభ సభాపతి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు. రేపు స్పీకర్ ఎన్నిక జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్