Monday, February 24, 2025
HomeTrending NewsYSRCP: ఇకపై గేర్ మార్చాలి : సిఎం జగన్

YSRCP: ఇకపై గేర్ మార్చాలి : సిఎం జగన్

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు. 175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం ఏమీ కాదని, కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్‌. నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

పార్టీ నేతలకు జగన్ దిశా నిర్దేశం చేశారు. ‘ఇప్పటివరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలం మరో ఎత్తు. వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం. మనం గేర్‌ మార్చాల్సిన అవసరం వచ్చింది. మన పార్టీ, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. సూచించారు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయి. మన పార్టీ, మన ప్రభుత్వం పట్ల సానుకూల అంశం చూశాం. ఇదే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలి’ అని సూచించారు సీఎం జగన్‌.

‘అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి. మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమే. టికెట్లు ఇవ్వనంత మాత్రాన నిరాశ వద్దు. కొందరికి టికెట్లు ఇవ్వొచ్చు.. మరికొందరికి ఇవ్వకపోవచ్చు. మరో అవకాశం కల్పిస్తాం’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కో-ఆర్డినేటర్లు, పార్టీ రీజినల్‌ ఇంచార్జులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్