Sunday, January 19, 2025
HomeసినిమాSPY: నిరాశ పరిచిన నిఖిల్!

SPY: నిరాశ పరిచిన నిఖిల్!

Mini Review: టాలీవుడ్ లో మంచి దూకుడు మీదున్న యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకరుగా కనిపిస్తాడు. నిజానికి టాలీవుడ్ లో ఇప్పుడు పోటీ గట్టిగా ఉంది. ఒక వైపు నుంచి వారసులు .. మరో వైపున షార్ట్ ఫిలిమ్స్ నుంచి కొత్తగా వస్తున్న హీరోల నుంచి గట్టిపోటీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాజెక్టును సెట్ చేసుకోవడం చాలా కష్టమైపోతోంది. అయినా నిఖిల్ టీమ్ వర్క్ చేస్తూ, పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అది నిలబెట్టుకోవలసిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. తాను సెలెక్ట్ చేసుకున్న కథలో క్లారిటీ ఉందో లేదో ఆలోచన చేసుకోవాలి.

‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న నిఖిల్, అంతకు ఎంతమాత్రం తగ్గకుండా ‘స్పై’ కథను సెట్ చేసుకున్నాడు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ డెత్ మిస్టరీ పై కథ నడవనుందనే ఒక అభిప్రాయాన్ని ఆడియన్స్ లో కలిగించారు. ఆపరేషన్ మొత్తం కూడా ఇదే అంశంపై కొనసాగుతుందని అంతా అనుకున్నారు. కానీ థియేటర్ కి వెళ్లినవారికి నిరాశే ఎదురైంది. నేతాజీకి సంబంధించిన విషయం ఒక అంశంగా మాత్రమే కనిపిస్తుంది. మరో అంశంగా కనిపించే దానిలోను విషయం లేదు.

ఒక ఊరుకు చేరుకోవాలంటే ఆ రూట్లో వెళ్లే బస్సే ఎక్కాలి. ఏదో బస్సు ఎక్కేసి మనం వెళ్లవలసిన ఊరు పేరు చెబితే మధ్యలోనే దింపేస్తారు. అలా హీరో తనకి తోచిన రూట్లో వెళుతూ ఉంటే, ఫాలోకాలేని ప్రేక్షకులు మధ్యలోనే డ్రాపవుతారు. ఎంచుకున్న కథ .. అల్లుకున్న కథనంపై క్లారిటీ లేకుండా ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందో .. ‘స్పై’ అలా ఉంటుంది. భారీ స్థాయిలో ఖర్చు చేశారు. కానీ అందుకు తగినట్టుగా బందోబస్తుగా కథను రెడీ చేసుకోలేకపోయారు. ఎప్పుడూ కూడా కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే అవసరం ఆడియన్స్ కి రాకూడదు .. దానంతట అదిగా అర్థమైపోవాలంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్