Sunday, January 19, 2025
Homeసినిమాహీరో నిఖిల్ కొత్త సినిమా ప్రకటన

హీరో నిఖిల్ కొత్త సినిమా ప్రకటన

75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ 19వ చిత్రం ప్రకటన  వెలువ‌డింది. హీరో నిఖిల్ తొలిసారి ఓ స్పై మూవీ చేస్తున్నారు. గూఢ‌చారి, ఎవ‌రు, హిట్ వంటి చిత్రాల‌తో అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న ప్ర‌ముఖ ఎడిట‌ర్ గ్యారీ బి.హెచ్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మార‌తుండ‌టం విశేషం. ఎం.జి. అమర్‌నాథ్ పిక్చ‌ర్స్‌, రెడ్ సినిమాస్ పతాకాల‌పై కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చ‌ర‌ణ్‌తేజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌న దేశ జెండా దాని ప‌క్క‌నే స‌రిహ‌ద్దులోని సైనికులతో ఉన్న అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అలాగే ఈ పోస్ట‌ర్‌లో ప్ర‌సిద్ధి చెందిన కొన్ని విదేశీ ప్రాంతాలు కూడా క‌నిపిస్తున్నాయి. వీట‌న్నంటినీ చూస్తుంటే భారీ స్పాన్‌తో ఈ సినిమా రూపొంద‌నున్నట్లు అర్థమ‌వుతుంది. స్వాతంత్య్ర దినోత్స‌వానికి ప‌క్కాగా స‌రిపోయే పోస్ట‌ర్ ఇది.

ఇంకా టైటిల్ పెట్ట‌ని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించ‌నున్నారు. వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే హీరో నిఖిల్ ఈ చిత్రంలో తొలిసారి గూఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. భారీ బడ్జెట్‌తో రూపొంద‌నున్న‌న ఈ ఎంట‌ర్‌టైన‌ర్ కోసం ప్ర‌ముఖ సాంకేతిక నిపుణులు ప‌నిచేయ‌బోతున్నారు. పోస్ట‌ర్‌ పై ‘ది హంట్ బిగిన్స్ సూన్’ అనే లైన్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలియజేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్