Sunday, March 15, 2026
Homeసినిమానిఖిల్ 'స్పై' ట్రైలర్ రిలీజ్..

నిఖిల్ ‘స్పై’ ట్రైలర్ రిలీజ్..

స్టార్ హీరోలు ఒక పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించడానికి ఎన్నో కష్టాలు పడుతుంటే.. యంగ్ సెన్సేషన్ నిఖిల్ మాత్రం వరుస పాన్ ఇండియా సినిమాలను రెడీ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ హీరో నుంచి ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో ఈ సినిమా కథ.. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలు చుట్టూ సాగనుందని తెలియజేసి ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేశాడు.

నిఖిల్ వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ‘స్పై’ రూపొందింది. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాద్ .. అమీర్ పేటలోని AAA సినిమాస్ లో నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ .. ఛేజింగ్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. ట్రైలర్ చివర్లో రానా మెరవడం విశేషం.

నిఖిల్ జోడీగా ఐశ్వర్య మీనన్ నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో సన్యా ఠాకూర్ ..  ఆర్యన్ రాజేశ్ .. జిషు సేన్ గుప్తా .. మకరంద్ దేశ్ పాండే .. అభినవ్ గౌతమ్ కనిపించనున్నారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మరణం .. దాని వెనుక గల రహస్యం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. నిఖిల్ ఫెస్టి టైమ్ చేస్తున్న భారీ యాక్షన్ మూవీగా దీనిని గురించి చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular