Monday, February 24, 2025
Homeసినిమాదేవుణ్ణి ప్రార్ధిస్తున్న నిఖిల్

దేవుణ్ణి ప్రార్ధిస్తున్న నిఖిల్

Pray to God: క‌రోనా కార‌ణంగా సినిమాలు వాయిదాప‌డ్డాయి. ఈ క‌రోనా కాలంలో సినిమాలు విడుద‌ల చేస్తే.. జ‌నం థియేట‌ర్లోకి వ‌స్తారో రారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో బాల‌య్య ‘అఖండ‌’, అల్లు అర్జున్ ‘పుష్ప‌’, నాని ‘శ్యామ్ సింగ రాయ్’, నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌ల ‘బంగార్రాజు’, రౌడీ బాయ్స్, హీరో త‌దిత‌ర‌ చిత్రాలు థియేట‌ర్లోకి వ‌చ్చాయి. అయితే.. పాన్ ఇండియా సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, అలాగే పెద్ద సినిమాలు అయిన ‘భీమ్లా నాయ‌క్’, ‘ఆచార్య’ వాయిదా ప‌డ్డాయి.

ఇదిలా ఉంటే… యువ హీరో నిఖిల్ క‌రోనా కార‌ణంగా త‌న సినిమాల‌ను విడుద‌ల చేయ‌లేక‌పోవ‌డం పై ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ… “కెరియర్లపై కరోనా ఇంతా ప్రభావం చూపడం బాధేస్తోంది. ‘అర్జున్ సురవరం’ విజ‌యం తర్వాత నాలుగు అద్భుతమైన స్క్రిప్టులు విని సినిమాలు ఒప్పుకున్నాను. ఆ సినిమాల మీద గట్టి నమ్మకంతో ఉన్నాను కానీ.. విడుదల తేదీలు అగమ్యగోచరంగా త‌యార‌య్యాయి. పరిస్థితులు చక్కబడాలని, సినిమాల విడుదలలు సాఫీగా సాగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు.

నిఖిల్ న‌టించిన‌ ‘18 పేజెస్’ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయొచ్చు. ఆయన సినిమాలకు తెలుగు మార్కెట్ చాలు. ఫిబ్రవరిలో నిజానికి పెద్ద సినిమాలు విడుదల కావ‌డం లేదు. అందుచేత ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేసుకోవ‌చ్చు. ఇంకా వెయిట్ చేస్తే… మార్చి నుంచి భారీ చిత్రాలు క్యూక‌డ‌తాయి. అప్పుడు ఎక్కువ థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్టం అవుతుంది. స‌రైన స్ర్కిప్టులు సెలెక్ట్ చేసుకున్న‌ప్ప‌టికీ… విడుద‌ల చేయ‌డానికి స‌రైన టైమ్ దొర‌క‌డం లేద‌ట‌. పాపం.. నిఖిల్. మ‌రి… త్వ‌ర‌లోనే నిఖిల్ సినిమాలు థియేట‌ర్లో వ‌స్తాయ‌ని.. ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయ‌ని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్