Sunday, January 19, 2025
Homeసినిమాపోలీస్ క్యారెక్టర్ లో నితిన్..?

పోలీస్ క్యారెక్టర్ లో నితిన్..?

నితిన్ ‘ఇష్క్’ సినిమాతో ఫామ్ లో వచ్చాడు. ఆ తర్వాత ‘గుండె జారి జారీ గల్లంతయ్యిందే’ తో బ్లాక్ బస్టర్ సాధించాడు. ట్రాక్ లోకి వచ్చాడు అనుకుంటే.. ఈమధ్య మళ్లీ ట్రాక్ తప్పాడు. అందుకనే. ఈసారి కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రైటర్ టర్నడ్ డైరెక్టర్ వక్కంతం వంశీతో సినిమా చేస్తున్నాడు. ఇందులో నితిన్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. వక్కంతం వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.

అయినప్పటికీ వంశీ పై ఉన్న నమ్మకంతో నితిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో నితిన్ పోలీస్‌గా క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. ఇందులో నితిన్ ఓ జూనియ‌ర్ ఆర్టిస్టుగా కనిపించబోతున్నాడు. జూనియ‌ర్ ఆర్టిస్ట్ అంటే లాయ‌ర్, డాక్ట‌ర్‌, ఇంజ‌నీర్.. ఇలా ర‌క‌ర‌కాల వేషాలు వేయాల్సివ‌స్తుంది. కాక‌పోతే పోలీస్ గెట‌ప్ మాత్రం అలాంటిది కాదని టాక్‌. ఈ సినిమాలో పోలీస్ పాత్ర‌కూ, అందులో భాగంగా వ‌చ్చే స‌న్నివేశాల‌కూ చాలా ప్రాధాన్యం ఉంద‌ని సమాచారం.

ఈ సినిమా కోసం జూనియ‌ర్‌, షైతాన్‌, ఎగ‌స్ట్రా ఆర్డిన‌రీ మేన్ అనే టైటిళ్లు ప‌రిశీలిస్తున్నారు. ముందుగా జూనియర్ అనే టైటిల్ అనుకున్నారు. ఈ టైటిల్ అంతగా బాగోలేదు అనుకున్నారో ఏమో కానీ.. వేరే టైటిల్స్ చూస్తున్నారు. అందులో ఎక్కువుగా ఎగస్ట్రా ఆర్డినరీ మేన్ బాగా వినిపిస్తుంది. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఈ మూవీతో నితిన్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్