Thursday, March 12, 2026
HomeసినిమాNithiin: హిట్టు కోసం గట్టిగానే ట్రై చేస్తున్న నితిన్!

Nithiin: హిట్టు కోసం గట్టిగానే ట్రై చేస్తున్న నితిన్!

నితిన్ టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎంత స్పీడ్ గా హిట్స్ చూశాడో .. అంతే ఫాస్టుగా ఫ్లాపులు చూశాడు. ఎన్ని ఫ్లాపులు పైన పడుతున్నా, తన దూకుడు తగ్గించకపోవడం ఆయన ప్రత్యేకత. నితిన్  క్రేజ్ పై అవి పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవడం ఆయన చేసుకున్న అదృష్టంగానే చెప్పుకోవచ్చు. ఒక రేంజ్ బడ్జెట్ ను సెట్ చేసుకుని తనకి నచ్చిన కథలను ఆయన చేస్తూ వెళుతుంటాడు.  అప్పటి వరకూ వెంటపడుతున్న ఫ్లాపులకు ఒక్క హిట్ తో  సమాధానం చెబుతుంటాడు.

నితిన్ కెరియర్ ను పరిశీలిస్తే ఆయన చివరిసారిగా హిట్ అనే మాట విన్నది ‘భీష్మ’ సినిమా కోసమేనని చెప్పాలి. వెంకీ కుడుముల దర్శకత్వంలో .. రష్మిక కథానాయికగా వచ్చిన ఆ సినిమా, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. వరుస ఫ్లాపులతో ఉన్న నితిన్ కి ఈ సినిమా ఊరటనిచ్చింది .. ఉత్సాహాన్ని ఇచ్చింది. మళ్లీ నితిన్ జోరు పుంజుకోనుందని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు.

‘భీష్మ’ తరువాత నితిన్ వరుస సినిమాలు చేస్తూ వెళ్లాడు. కానీ ఆ సినిమాల ఫలితాలన్నీ అభిమానులను నిరాశపరిచాయి. ఇక ఈ సినిమా తరువాత వెంకీ కుడుముల కూడా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయాడు. ఇక రష్మిక మాత్రం గట్టి సక్సెస్ లే తన ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. హిట్టు కోసం నితిన్ మళ్లీ వెంకీ కుడుములకే ఛాన్స్ ఇచ్చాడు. అలా ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నితిన్ – వెంకీ కుడుముల కలిసి మరోసారి హిట్ కొడతారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular