Sunday, January 19, 2025
Homeసినిమానితిన్ కి ఇప్పుడు హిట్టు చాలా అవసరం!

నితిన్ కి ఇప్పుడు హిట్టు చాలా అవసరం!

మొదటి నుంచి కూడా నితిన్ కెరియర్ పరంగా ఎక్కడా గ్యాపు రాకుండా చూసుకుంటూ వెళుతున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతూ, తన ఏజ్ గ్రూప్ హీరోల రేస్ లో దూసుకుపోతూనే  ఉన్నాడు. ఎప్పుడైనా బయట బ్యానర్లకి సంబంధించిన ప్రాజెక్టులు డిలే అయితే, వెంటనే తన సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.ఒకానొక దశాలో ఆయన హిట్ అనే మాట వినడానికి చాలా కాలం పట్టేసింది. అయినా తట్టుకుని నిలబడటం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

టీనేజ్ లోనే నితిన్ ఇండస్ట్రీకి రావడం వలన, ఇక్కడి పరిస్థితులు ఆయనకి బాగా తెలుసు. అందువలన కెరియర్ విషయంలో ఆయన కూల్ గా ముందుకు వెళుతున్నాడు. ‘భీష్మ’ సినిమా ఆయనకి పెద్ద హిట్ తెచ్చిపెట్టింది. కొన్ని ఫ్లాపుల తరువాత ఆయన అందుకున్న సక్సెస్ అది. ఇక అక్కడి నుంచి హిట్స్ పడతాయని ఆయన ఫ్యాన్స్ భావించారు. కానీ ఆ సినిమా తరువాత ఆయనకి ఇంతవరకూ హిట్ పడలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు.

ఆయన నుంచి రావడానికి ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’ సినిమా రెడీ అవుతోంది. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిసెంబర్ 8వ తేదీన విడుదల కానుంది. ఈ ఏడాదిలో నితిన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. అందువలన ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టవలసిన అవసరం ఉంది. ఇక ‘ఆదికేశవ’ సినిమా రిజల్టు విషయంలో అసంతృప్తిగా ఉన్న శ్రీలీలకి కూడా ఈ సినిమా హిట్ అవసరమేనని చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్