Tuesday, March 17, 2026
Homeసినిమాయాక్షన్ లుక్ లో నితిన్ ఫస్ట్ ఛార్జ్

యాక్షన్ లుక్ లో నితిన్ ఫస్ట్ ఛార్జ్

First Charge: యంగ్ హీరో నితిన్ విలక్షణమైన క‌థాంశంతో MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తన 31వ చిత్రంగా న‌టిస్తున్న‌ చిత్రం మాచర్ల నియోజకవర్గం.. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతోంది. ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా మేకర్స్ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) నేడు విడుదల చేశారు. “నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. ‘సిద్ధార్థ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా. మీకు నచ్చే , మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా..’ అంటూ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ లుక్ పోస్టర్ సంద‌ర్భంగా నితిన్ ట్వీట్ చేశారు.

ఈ లుక్‌ లో నితిన్‌ మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. సీరియస్‌గా ఆలోచిస్తూ చూపించిన పోస్టర్ ఆకట్టుకుంది. త‌ను పోరాటానికి సిద్ధ‌మై దాడిని ఎదుర్కోవ‌డానికి రెడీగా కూర్చున్న‌ట్లుంది. మెడ‌లో వెండిలాకెట్‌ ధ‌రించిన నితిన్ వెనుక పులిచార‌లున్న బాడీతో మారణాయుధాలతో కొంద‌రు దాడి చేయడం చూస్తుంటే, ఓ జాత‌ర‌లో జ‌రుగుతున్న యాక్ష‌న్ సీన్‌ గా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ పోస్ట‌ర్‌ చూస్తే గూస్‌బంప్స్ వ‌చ్చేలా వుంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular