Monday, March 16, 2026
HomeTrending Newsఏపి పథకాలపై నీతి ఆయోగ్ సంతృప్తి

ఏపి పథకాలపై నీతి ఆయోగ్ సంతృప్తి

ఏపీ ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేస్తోందని నీతిఆయోగ్‌ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని నీతిఆయోగ్‌ సలహాదారు శాన్యుక్తా సమద్దార్, నీతిఆయోగ్‌ ఎస్‌డీజీ ఆఫీసర్‌ అలెన్‌ జాన్, నీతిఆయోగ్‌ డేటా ఎనలటిక్స్‌ ఆఫీసర్‌ సౌరవ్‌ దాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో రాష్ట్ర  ప్రణాళికా శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు.  నవరత్నాలలో భాగంగా వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేయడంపై  నీతి ఆయోగ్ సభ్యులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020–21 నివేదికను నీతిఆయోగ్‌ బృంద సభ్యులు సిఎం జగన్ కు అందజేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్దికి తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్దికి ఇస్తున్న ప్రాధాన్యతను నీతిఆయోగ్‌ సభ్యులకు సిఎం వివరించారు. నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో వెలగపూడి సచివాలయంలో సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీస్‌); ఇండియా ఇండెక్స్‌ 2020–21, మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ (ఎంపీఐ) అంశాలపై రెండు రోజులపాటు వర్క్ షాప్ జరిగింది.   ఎస్‌డీజీ ర్యాంకింగుల్లో  రాష్ట్రాన్ని మొదటి స్ధానంలో నిలిపేందుకు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.  చర్చ. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనపై రాష్ట్ర, జిల్లా స్ధాయి అధికారులకు నీతిఆయోగ్‌ ఆధ్యర్యంలో దిశానిర్దేశం చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారుల బృందం వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular