NIti Ayog Team Visit:
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. రాష్ట్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాజీవ్ కుమార్ నేతృత్వంలోని , నీతి ఆయోగ్ బృందం ఆంధ్ర ప్రదేశ్ విచ్చేసింది. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ సిఎంను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
అంతకుముందు, కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గంలోని వీరపనేని గూడెంలో సేంద్రీయ వ్యవసాయ వరి పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. సేంద్రీయ వ్యవసాయం, వారు అనుసరిస్తున్న పద్ధతులపై రైతులను అడిగి ఈ బృందంలోని సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాన్ని కూడా వారు పరిశీలించారు.
Also Read : పెట్రోలు పై ఢిల్లీలో వ్యాట్ తగ్గింపు