Friday, October 18, 2024
HomeసినిమాNitin: నితిన్ `ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మేన్‌`

Nitin: నితిన్ `ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మేన్‌`

నితిన్ క‌థానాయకుడిగా రూపొందుతోన్న 32వ చిత్రానికి ‘ఎక్స్‌ట్రా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ‘ఆర్డిన‌రీ మేన్‌` ట్యాగ్ లైన్‌. రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. శ్రీలీల  హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. డిఫ‌రెంట్‌గా ఉన్న‌ ఫ‌స్ట్ లుక్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. పోస్ట‌ర్‌లో నితిన్ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌తో క‌నిపిస్తున్నారు. ఓ దానిలో ఆయ‌న హెయిర్ స్టైల్‌, గ‌డ్డంతో సీరియ‌స్‌గా క‌నిపిస్తున్నారు. అదే పోస్ట‌ర్‌లో మ‌రో లుక్‌లో గ‌డ్డం లేకుండా చాలా కూల్‌గా క‌నిపిస్తున్నారు నితిన్‌.

పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌లో ఓ స‌న్నివేశానికి సంబంధించిన స్క్రిప్ట్ క‌నిపిస్తుంది. అలాగే క్లాప్ బోర్డ్ కూడా క‌నిపిస్తుంది. నితిన్ లుక్ చాలా కొత్త‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. `ఎక్స్‌ట్రా` అనే టైటిల్‌తో పాటు `ఆర్డిన‌రీ మేన్‌` అనే ట్యాగ్ లైన్ పోస్ట‌ర్‌లో మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తోంది. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, ఖచ్చితంగా ఆయ‌న అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ త‌న బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. హ‌రీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ “ఎక్స్‌ట్రా క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌కి రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ న‌వ్విస్తూనే స‌ర్‌ప్రైజ్‌ల‌తో సినిమా మెప్పించ‌నుంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్