Tuesday, March 10, 2026
Homeసినిమామ్యాస్ట్రో షూటింగ్ పూర్తి

మ్యాస్ట్రో షూటింగ్ పూర్తి

హీరో నితిన్‌ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం మ్యాస్ట్రో. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే.. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో మ్యాస్ట్రో సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్‌ స్టార్ట్ చేసిన బిగ్ మూవీ కూడా మ్యాస్ట్రో నే కావడం విశేషం.

ఇప్పటికే నితిన్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన మ్యాస్ట్రో ఫస్ట్‌లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు నితిన్‌ హిట్‌ మూవీ ‘భీష్మ’కు మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వరసాగరే.. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న మ్యాస్ట్రో సినిమాకు జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్షన్, డైలాగ్స్‌: మేర్లపాక గాంధీ నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి. అయితే.. ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular