Friday, February 21, 2025
HomeసినిమాNitya Menon: టాలీవుడ్ కి దూరంగా నిత్యామీనన్!

Nitya Menon: టాలీవుడ్ కి దూరంగా నిత్యామీనన్!

నిత్యామీనన్ .. పరిచయం అవసరం లేని పేరు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో మొన్న మొన్నటివరకూ  వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అందాల నాయిక. ఎలాంటి స్కిన్ షో చేయకుండా టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడిన కథానాయికల జాబితాలో అఆమే కనిపిస్తుంది. ఈ విషయంలో  సాయిపల్లవి కంటే ముందుగా కనిపించే ఆర్టిస్ట్ నిత్యామీనన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యామీనన్ కాస్త హైటూ తక్కువనే మాటేగానీ, నటన పరంగా ఆమె ముందు నిలబడాలంటే నటనలో మంచి అనుభవం కలిగినవారై ఉండాలి.

విశాలమైన కళ్లతో విన్యాసాలు చేయిస్తూ, అద్భుతమైన హావభావాలను అత్యంత సహజంగా ఆవిష్కరించడం నిత్యామీనన్ ప్రత్యేకత. మొదటి నుంచి నిత్యామీనన్ గ్లామరస్ పాత్రలకి దూరంగా .. నటన ప్రధానమైన పాత్రలకి దగ్గరగా కనిపిస్తూ కెరియర్ ను నడిపించింది. సాధారణంగా స్కిన్ షో విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసే హీరోయిన్స్ ను వెంటనే పక్కన పెట్టేస్తుంటారు. అలా జరగకుండా ఉండాలంటే చాలా టాలెంట్ కావాలి. అలాంటి టాలెంట్ పుష్కలంగా ఉన్న కథానాయికగా నిత్యామీనన్ కనిపిస్తుంది.

నిత్యామీనన్ చైల్డ్ ఆర్టిస్టుగా 1998లోనే వెండితెరకి పరిచయమైంది. ఆ తరువాత 2011లో ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఖాతాలో మంచి మంచి హిట్స్ ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఆమె అదే క్రేజ్ ను సొంతం చేసుకోవడం విశేషం. అలాంటి నిత్యా మీనన్ ‘జనతా గ్యారేజ్’ తరువాత ఒకటి రెండు సినిమాల్లో తప్ప చెప్పుకోదగిన పాత్రలు చేయలేదు. అక్కడి నుంచి చూసుకుంటే ఆమె టాలీవుడ్ కి దూరమవుతూ వెళ్లడం కనిపిస్తుంది. తమిళ .. మలయాళ సినిమాలు చేస్తూ వెళుతున్న నిత్యా మీనన్ కి, తెలుగు నుంచి కూడా మంచి ఆఫర్లు వెళ్లాలనేది అభిమానుల కోరిక.

RELATED ARTICLES

Most Popular

న్యూస్