Monday, February 24, 2025
Homeసినిమానివేదా పేతురాజ్ కి ఇది కలిసొచ్చే కాలమే! 

నివేదా పేతురాజ్ కి ఇది కలిసొచ్చే కాలమే! 

కోలీవుడ్ నుంచి తెలుగు తెరకి పరిచయమైన అందమైన భామలలో నివేదా పేతురాజ్ ఒకరు. 2016లోనే తమిళ తెరకి పరిచయమైన ఈ బ్యూటీ, ‘మెంటల్ మదిలో’ సినిమాతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. ఇంతకాలం ఈ సుందరి ఏమయిపోయిందబ్బా అనుకుంటూ కుర్రాళ్లు మనసులు పారేసుకున్నారు. ఈ బ్యూటీ ఒక రేంజ్ లో తన జోరును కొనసాగించడం ఖాయమని అనుకున్నారు.

ఇటు మోడ్రన్ డ్రెస్సుల్లోను .. అటు చీరకట్టులోను అందంగా మెరవడం నివేద ప్రత్యేకత. అందువలన యూత్ లో ఆమె క్రేజ్ పెరగడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అందుకు తగినట్టుగానే ‘చిత్రలహరి’ .. ‘ బ్రోచేవారెవరురా’ .. ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో ఆమెకి మంచి పాత్రలు పడుతూ వచ్చాయి. ఆ పాత్రలలో ఆమె మరింతగా ఆకట్టుకుంది. ఆడియన్స్  చూపులు తనవైపు నుంచి తప్పుకోకుండా చూసింది.

హైటు ఎక్కువగా ఉండటం వలన, నివేదాకి వచ్చే అవకాశాలు తగ్గాయనేది వాస్తవం .. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందువల్లనే విష్వక్సేన్ తో ‘పాగల్’ చేసిన ఆమె, మరోసారి ఆయన జోడీగా ‘దాస్ కా ధమ్కీ’ సినిమా చేసింది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమా తన కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఇక మరో వైపున వెబ్ సిరీస్ ల నుంచి కూడా ఆమెకి అవకాశాలు వస్తుండటం విశేషం. మొత్తానికి నివేదా త్వరలో మరింత బిజీ కానుందనేది మాత్రం వాస్తవం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్