Sunday, January 19, 2025
Homeసినిమాఆచార్య హిందీ రిలీజ్ ఉందా?  లేదా?

ఆచార్య హిందీ రిలీజ్ ఉందా?  లేదా?

Hindi Acharya: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య‌. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషించ‌డం విశేషం. చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తే.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విడుదలయ్యే తెలుగు సినిమాలను మార్కెట్ దృష్ట్యా హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. పైగా ఆర్ఆర్ఆర్ సినిమాతో చ‌ర‌ణ్ కు నార్త్ లో మంచి క్రేజ్ రావ‌డంతో ఆచార్య సినిమాను హిందీలో కూడా విడుద‌ల చేయ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఆచార్య హిందీ రిలీజ్ కి సంబంధించి అఫిషియ‌ల్ గా ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఆచార్య చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తారా..?  లేదా.? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. త్వ‌ర‌లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్