Tuesday, September 17, 2024
HomeTrending NewsNo Confidence: కేంద్రం వివక్ష...అవిశ్వాసానికి మద్దతు - బీఆర్ ఎస్

No Confidence: కేంద్రం వివక్ష…అవిశ్వాసానికి మద్దతు – బీఆర్ ఎస్

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ఎంపి నామ నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో అన్ని ప్రాంతాలను, రాష్ట్రాలను సమ దృష్టితో అభివృద్ధి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని నామ ఆరోపించారు. దేశమంతా వైద్య కళాశాలలు మంజూరు చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క కళాశాల కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించాకున్నా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కెసిఆర్ ప్రభుత్వం వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తోందని…కేంద్రం వైఖరి ఆక్షేపనీయం అన్నారు.

తెలంగాణను సస్యశామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే కేంద్ర జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. సిఎం కెసిఆర్ దగ్గరి నుంచి మంత్రులు, ఎంపీలు లేఖలు రాయటం, సంబంధిత మంత్రులు, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినా కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వలేదని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక నవోదయ, సైనిక్ స్కూల్స్ మంజూరు కోసం ఎన్ని విన్నపాలు చేసినా పెడచెవిన పెట్టారని మందిపాడ్డారు.

కేంద్రప్రభుత్వ సహాయ నిరాకరణ… నిర్లక్ష్యం దృష్ట్యా కేంద్రప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు.

ఈ దశలో జోక్యం చేసుకున్న బిజెపి ఎంపి నిషికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయలదన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. కేంద్ర ప్రభుత్వం 86 వేల కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్