Monday, March 16, 2026
HomeTrending NewsVruksha vedam: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ప్రకృతి పరిక్షణ - కైలాష్ సత్యార్థి

Vruksha vedam: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ప్రకృతి పరిక్షణ – కైలాష్ సత్యార్థి

బచ్‌పన్ బచావో ఆందోళన్ వంటి సంస్థలను స్థాపించి వేలాదిమందికి విద్యానందించడంతో పాటు.. దేశంలో బాలల హక్కుల కోసం నిరంతరంగా కృషిచేస్తూ.. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న కైలాష్ సత్యార్థి ఇవ్వాల “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి.. గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్ లో మొక్కలు నాటారు.* ఈ సందర్భంగా.. జోగినిపల్లి సంతోష్ కుమార్.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో ప్రకృతి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకువచ్చిన “వృక్షవేదం” “హరితహాసం” పుస్తకాలను కైలాస్ సత్యార్ధికి అందించి సత్కరించారు.

అనంతరం కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ.. పచ్చని ప్రపంచం కోసం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్విరామంగా కృషిచేస్తున్నారు. ఈ దేశంలో ఒక యువ పార్లమెంటేరియన్ ఈ విధంగా ప్రకృతి పరిక్షణ కోసం, భవిష్యత్ తరాల బాగుకోసం పనిచేయడం చాలా గొప్ప విషయం. ఈ నేలను, సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు నాయకులుగా మారితే ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుందని.. ఆ కోవలో ప్రథముడు జోగినిపల్లి అంటూ సంతోష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు.

అనంతరం మాట్లాడిన జోగినిపల్లి సంతోష్ కుమార్.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6.0” ప్రారంభంలోనే కైలాష్ సత్యార్థి లాంటి గొప్ప వ్యక్తి పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హక్కుల ఉద్యమకారులందరికి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” చేరువవుతుందన్నారు జోగినిపల్లి సంతోష్ కుమార్.

ఈ కార్యక్రమంలో ఐఐఐటీ విద్యార్ధులతో పాటుగా.. డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్, “గ్రీన్ ఇండియా చాలెంజ్” ఫౌండర్ మెంబర్స్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular