Tuesday, March 17, 2026
Homeసినిమాప్ర‌భాస్ మూవీపై కరీనా క్లారిటీ!

ప్ర‌భాస్ మూవీపై కరీనా క్లారిటీ!

ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ‘ఆదిపురుష్‘ షూటింగ్ పూర్త‌యి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటోంది. జ‌న‌వ‌రిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.  ఆ త‌ర్వాత ‘స‌లార్’ ను వ‌చ్చే సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత పాన్ వ‌రల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’ విడుద‌ల కానుంది.  ఇలా వరుస‌గా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నారు ప్ర‌భాస్.

ఈ సినిమాల‌తో పాటు అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ష‌న్ లో స్పిరిట్ అనే సినిమా చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇది ప్ర‌భాస్ కు 25వ చిత్రం. ఈ సినిమాలో  హీరోయిన్ గురించి కొన్ని వార్త‌లు ప్రచారంలోకి వ‌చ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తున్నట్లుగా టాక్ వినిపించింది.

అయితే.. ప్ర‌చారంలో ఉన్న వార్త గురించి కరీనా కపూర్ ని ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆమె స్పందించింది. ప్రభాస్ తో నటించేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని.. కానీ ఇప్పటి వరకు అలాంటి ఛాన్స్ రాలేదని.. తనను ఎవరు కూడా అప్రోచ్ అవ్వలేదని కరీనా కపూర్ ఖాన్ క్లారిటీ ఇచ్చింది. మ‌రి.. ప్ర‌భాస్ స్పిరిట్ మూవీలో న‌టించే ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి.

Also Read :  ఆదిపురుష్ యువి క్రియేష‌న్స్ కి లాభాలు అందిస్తుందా..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular