Friday, March 20, 2026
Homeసినిమాఅది మాత్రం ఇంపాజిబుల్: మహేశ్ బాబు 

అది మాత్రం ఇంపాజిబుల్: మహేశ్ బాబు 

Impossible: మహేశ్ బాబు హీరోగా ‘సర్కారువారి పాట‘ సినిమా రూపొందింది. భారీ బడ్జెట్  తో నిర్మితమైన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 12వ తేదీన అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్  అన్నీ కూడా జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోవడంతో, హిట్ ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహేశ్ బాబు పాత్రను పరశురామ్ డిజైన్ చేసిన తీరుపట్ల అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు.

 నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ బాబు బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ  .. “ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ నచ్చింది .. అందువల్లనే ఓ పది నిమిషాల పాటు కథ వినగానే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాలో నా మెడపై వన్ రూపీ కాయిన్ టాటూ ఉంటుంది . అది ఎందుకోసమని అంతా అడుగుతున్నారు. ఆ టాటూ వెనక  ఒక కథ ..  కారణం ఉంటాయి. అవేమిటనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

నా డైలాగ్ డెలివరీనీ ఎవరూ మిమిక్రీ చేయలేరు .. అది ఇంపాజిబుల్. ఇక నాతో ఒక పాటైనా పాడించాలని చాలామంది ట్రై చేశారు. కానీ నేను ఎప్పుడూ కూడా పాడటానికి ప్రయత్నించలేదు .. నాకు పాడటం  రాదు కూడా. నా తరువాత సినిమాలు త్రివిక్రమ్ గారితోను .. రాజమౌళిగారితోను ఉన్నాయి. ముందుగా త్రివిక్రమ్ గారి ప్రాజెక్టు మొదలవుతుంది. ఆ ఆయన రాసిన డైలాగ్స్ చెప్పి చాలా కాలమవుతోంది. షూటింగు ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నాను ” అని చెప్పుకొచ్చారు .

Also Read : నేనే ‘కళావతి’ని కావడం నా అదృష్టం: కీర్తి సురేశ్   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular