సిఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ, నామినేటెడ్ పదవుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తూ వస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ రెండేళ్లలో సామాజికంగా, ఆర్ధికంగా, మహిళా సాధికారత పరంగా, అభివృద్ధి-సంక్షేమపరంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయన్నారు. ఆట్టడుగు స్థాయినుంచి బడుగువర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు.
విజయవాడ లోని ఆర్ అండ్ బి కార్యాలయం ఆవరణలో ఉన్న మీడియా పాయింట్ నుంచి ఈ జాబితాను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సజ్జలతో పాటు మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, సుచరిత, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యే మెరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఇస్తున్న పదవులు అలంకార ప్రాయం కాదని, జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ మహా యజ్ఞంలో పదవులు పొందిన వారందరినీ భాగస్వామ్యం చేస్తామన్నారు సజ్జల. 135 సంస్థలకు చైర్మన్ పోస్టులకు చైర్మన్ పదవులు ఇస్తుంటే, వీటిలో 76 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 59 ఒసీలకు కేటాయించామని వివరించారు.
మహిళలకు 68, పురుషులకు 67 కేటాయించామన్నారు. 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు….. 44 శాతం ఇతరులకు ఇచ్చామని తెలిపారు. మహిళలకు 50.4 శాతం కేటాయించినట్లు తెలిపారు
జిల్లా మొత్తం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ
శ్రీకాకుళం 7 6
విజయనగరం 7 5
విశాఖపట్నం 10 5
తూర్పు గోదావరి 17 9
పశ్చిమ గోదావరి 12 6
కృష్ణా 10 6
గుంటూరు 9 6
ప్రకాశం 9 5
నెల్లూరు 10 5
చిత్తూర్ 12 7
కడప 11 6
అనంతపురం 10 5
కర్నూల్ 10 5