Tuesday, September 17, 2024
HomeTrending NewsORR : కేసీఆర్ పాలనలో 5 లక్షల కోట్ల అప్పులు - భట్టి విమర్శ

ORR : కేసీఆర్ పాలనలో 5 లక్షల కోట్ల అప్పులు – భట్టి విమర్శ

తెలంగాణ, హైదరాబాద్ అభివ్రుద్ధిని ఏ మాత్రం పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం అవుటర్ రింగు రోడ్డును 30 ఏళ్లపాటు టోల్ వసూలు చేసుకేందుకు ఒక  కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవటం శోచనీయమని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. వీళ్లను ఎన్నుకున్నదే ఐదేళ్ల కోసం.. అదికూడా పాలించడానికే తప్ప భూములు అమ్ముకోవడానికి కాదన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల కోసం నిర్మించిన ఆస్తులను , సంస్థలను వ్యవస్థలను దశాబ్దాలపాటు లీజుకు ఇవ్వడానికో అమ్ముకోవడానికో కానేకాదని స్పష్టం చేశారు. పీపుల్స్ మార్చ్ లో భాగంగా ఈ రోజు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క హన్మకొండ జిల్లా అబ్దుల్లా నాగారంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కుదవపెట్టి.. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసిందని, మోయలేనంత భారాన్ని ప్రజలపై వేసిందని భట్టి ఆరోపించారు. అపారమైన వనరులు, అద్భతంగా వస్తున్న పన్నులతో అభివ్రుద్ధ చేసుకునే అవకాశం ఉన్నా.. మిగులు బడ్జెట్ ను నాశనం చేసి, రూ. 5 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. అది సరిపోక రింగ్ రోడ్డును టోల్ వసూలు చేసుకునేందుకు ఒక ప్రవేట్ కంపెనీకి అగ్రిమెంట్ చేసుకున్నావు. ఆ 30 ఏళ్ల టోల్ మొత్తాన్ని ఇప్పుడే ఈయన వసూలు చేసుకుని ప్రజల ఆస్తిని నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వం వసూలు చేయాల్సిన పన్నులను ఒక అదానీకో, అంబానీకో రాబోయో 30 ఏళ్లకు తెలంగాణ పన్నుల వసూలు చేసుకొమ్మని అగ్రిమెంట్ చేసుకుని.. ఆ డబ్బులు ఇప్పుడే నాకు కట్టండని చేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇదీ అలాగే ఉందన్నారు. రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన దుర్మార్గ పాలన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందినకాడికి అమ్మేసే ప్రయత్నం చేస్తోందని విక్రమార్క విమర్శించారు. హైదరాబాద్ లో ఉన్న భూములను అమ్ముతున్నారని, చివరకు గత ప్రభుత్వాలు పేదలకు అసైన్ చేసిన భూములను వదలడం లేదన్నారు. ఇంతటి దోపిడీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా లేదన్నారు. ఈ పదేళ్లో కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యమని, ఈ రోజు రాష్ట్రంలో 15 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమైతే. ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందించిపెట్టించింది కాంగ్రెస్ మాత్రమే అని గుర్తు చేశారు. నీళ్ల కోసం ఈ రాష్ట్నాన్ని తెచ్చుకున్నాం. గోదావరి మీద  కెసిఆర్ మొదలు పెట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఎక్కడైనా ఒక్క ఎకరానికి నీళ్లు పారిస్తున్నారా? క్రిష్ణానదిమీద మీరు మొదలు పెట్టింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఇంతవరకూ ఒక్క చుక్క నీళ్లు పంపు చేసేందుకు ఒక మొటార్ కూడా పెట్టలేదన్నారు. నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణలో అటు గోదావరి, ఇటు క్రిష్ణ నీళ్లు కూడా తీసుకురాలేదు. దశాబ్దకాలంలో రాష్ట్రంలో ఒక్క బీహెచ్ఈఎల్ వంటి పరిశ్రమ తీసుకురాలేదని విమర్శించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్