ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. వరంగల్ సభతో మనపై ఇష్టానుసారంగా మాట్లాడే వారికి ఎక్కడికక్కడ గట్టిగా బదులు ఇవ్వండని, వాళ్ళ నోర్లు మూయించాలన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ, ఎల్పీ సంయుక్త సమావేశంలో కెసిఆర్ పార్టీ నేతలకు వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
సమావేశంలో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…
రోజు 20 నియోజక వర్గాల వారిగా తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. ఈసారి మనం ముందస్తు ఎన్నుకలకు వెళ్లడం లేదు. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రెండేళ్లు ఉంది కాబట్టి అన్ని పనులు పూర్తి చేసుకుందాం. రాబోయే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్ట పడి పనిచేయండి.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం. ఈ నెల 27 హుజురాబాద్ లో ప్రచార సభకు ఏర్పాట్లు చేయండి. ప్లీనరీ సభను 14000 నుంచి 6000 మందికి కుదింపు. వరంగల్ విజయ గర్జన సభకు ప్రతి ఊరు నుంచి బస్సు రావాలి. గ్రామ స్థాయి కమిటీలు అయి పోయాయి. హుజురాబాద్ లో టీఆర్ఎస్ 13% బీజేపీ కంటే లీడ్లో ఉన్నాము. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నాం.
వరంగల్ సభ ఇంచార్జీ గా వర్కింగ్ ప్రసెండెంట్ కేటీఆర్. వరంగల్ సభకు 22 వేల బస్సులతో జనం తరలింపు. హైదరాబాద్ లో నిర్వహించే ప్లీనరీ కి నియోజక వర్గం నుంచి 50 మంది రావాలని కెసిఆర్ స్పష్టం చేశారు.