Friday, March 20, 2026
HomeTrending Newsప్రభుత్వ పాఠశాలకు ఎన్నారై రమేష్ భూ విరాళం

ప్రభుత్వ పాఠశాలకు ఎన్నారై రమేష్ భూ విరాళం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్‌ తరహాలో విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ”మన ఊరు మన బడి”.

సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ని స్ఫూర్తిగా తీసుకొని లండన్ కు చెందిన ఎన్నారై బిఆర్ఎస్ నాయకుడు రమేష్ బాబు ఇసంపల్లి తన సొంతూరు మంచిర్యాల పట్టణ కేంద్రంలోని హమాలీవాడలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల పక్కన ఉన్న తన 8 గుంటల విలువైన భూమిని పాఠశాలకు విరాళంగా అందజేశాడు. ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లంతో కలిసి దీనికి సంబందించిన పత్రాలను రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ని కలిసి అందజేశారు. విదేశాల్లో ఉంటూ తెలంగాణ గడ్డ పై చూపిస్తున్న ప్రేమ పట్ల, ఇంతటి బృహత్తరమైన కార్యక్రమములో పాలు పంచుకున్నందుకు ఎన్నారై రమేష్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మన ఊరు-మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఇటీవల లండన్ లో పర్యటించిన కేటీఆర్ తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో కలసిరావాలని ఎన్నారైలకు ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది తనవంతు సహకారం అందించానని తెలిపాడు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular