Monday, April 21, 2025
HomeTrending NewsNS Bhati: గ్రేహౌండ్స్‌ గురువు నారాయణసింగ్‌ భాటి మృతి

NS Bhati: గ్రేహౌండ్స్‌ గురువు నారాయణసింగ్‌ భాటి మృతి

గ్రేహౌండ్స్‌ గురువు నారాయణసింగ్‌ భాటి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గ్రేహౌండ్స్‌ దళాన్ని ఏర్పాటుచేసిన భాటి.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేశారని చెప్పారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణసింగ్‌ భాటి (94) మంగళవారం (జూన్‌ 13న) కన్నుమూశారు. సహస్త్ర సీమా బల్‌ (SSB) రిటైర్డ్‌ డీఐజీ అయిన భాటి పోలీసులను యుద్ధ నిపుణులుగా తీర్చి దిద్దారు.

ఎస్‌ఎస్‌బీలో రిటైర్‌ అయిన తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో అప్పటి ఐపీఎస్‌ అధికారి కేఎస్‌ వ్యాస్‌ అభ్యర్థన మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వచ్చి గ్రేహౌండ్స్‌ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. నక్సల్స్ ను ఎదుర్కునేందుకు పోలీసులకు గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పారు. గ్రేహౌండ్స్‌ గురువుగా ఖ్యాతికెక్కిన భాటిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే భాటీ అంటే ఉభయ రాష్ట్రాల తెలుగు పోలీసు అధికారులతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల పోలీసు అధికారులకు అమితమైన గౌరవం. రాజస్తాన్ కు చెందిన భాటీ కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడ్డారు. పోలీసు ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు అమెరికా రమ్మని ఎన్నిసార్లు కోరినా నా ఖర్మ భూమి హైదరాబాద్ అని గ్రే హౌండ్స్ వసతి సముదాయంలోనే ఉండిపోయారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్