Sunday, January 19, 2025
HomeTrending Newsరేపు ఉమా మహేశ్వరి అంత్యక్రియలు

రేపు ఉమా మహేశ్వరి అంత్యక్రియలు

ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు రేపు హైదరాబాద్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఆమె మొదటి కుమార్తె విశాల అమెరికా నుంచి ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఎన్టీఆర్ నాలుగో కుమార్తె  ఉమా మహేశ్వరి నిన్న జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో  ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డారు.  ఒత్తిడి, అనారోగ్యం సమస్యలతోనే ఆమె  ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిసింది.

అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసిన జూబ్లీహిల్ల్స్ పోలీసులు ఐ పిసి సెక్షన్ 174 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.

పోస్టుమార్టం కోసం నిన్న సాయంత్రం మృత దేహాన్ని ఉస్మానియా  ఆస్పత్రి మార్చురీకి తరలించారు,  అక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆమె కోరిక మేరకు కళ్ళను ఎల్వీ  ప్రసాద్ కంత్రి ఆస్పత్రికి దానం చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆమె తమ్ముడు, సినీ నటులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అప్పగించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్స్ లోని ఆమె స్వగృహంలో పార్దీవ దేహాన్ని ఉంచారు. పలువురు నేతలు, సినీ పరిశ్రమ  ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్