Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ కోసం నాని విలన్ ని దింపుతున్నారా..?

ఎన్టీఆర్ కోసం నాని విలన్ ని దింపుతున్నారా..?

ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. ఎన్టీఆర్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో కొరటాల అలా చూపించనున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తుండడం విశేషం. ఆమధ్య ఇద్దరి పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు.

త్వరలో రామోజీ ఫిలింసిటీలో ఇద్దరి పై భారీ అండర్ వాటర్ ఎపిసోడ్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మరో విలన్ కూడా ఉన్నాడట. ఎవరంటే.. నాని దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా కన్ ఫర్మ్ చేశాడు. అలాగే దేవర మేకర్స్ కూడా అఫిషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసి కన్ ఫర్మ్ చేశారు. దసరా మూవీలో ఆయన విలనిజం బాగా పండించాడు. ఇక యుువ హీరో నాగ శౌర్య రంగబలిలో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలోనే విలన్ గా నటించే ఛాన్స్ దక్కించుకోవడంతో మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కొరటాల సినిమాల్లో మంచి సందేశం ఉంటుంది. ఇందులో కూడా మంచి సందేశం ఉంటూనే యాక్షన్ ను భారీగా ఉండేలా.. మాస్ ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యేలా డిజైన్ చేశారట కొరటాల. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుథ ఆర్ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్