Saturday, January 18, 2025
HomeTrending Newsఎన్టీఆర్ కు తెరాస నేతల ఘన నివాళి

ఎన్టీఆర్ కు తెరాస నేతల ఘన నివాళి

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, న‌టుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజ‌యంతి సందర్భంగా అధికార టీఆర్ఎస్ నేత‌లు హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. టీఆర్ఎస్ ఆవిర్భాం తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో గులాబీ నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి పురస్కరించుకొని కొంద‌రు టీఆర్ఎస్ ప్ర‌తినిధులు ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్లి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. నివాళులు అర్పించిన వారిలో మంత్రి మల్లారెడ్డి, ఎంపి నామ నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీ, నల్లమోతు భాస్కర్ రావు, వివేకానంద్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఉన్నారు.

టీఆర్ఎస్ మొదటి నుంచి ఎన్టీఆర్‌పై సానుకూల వైఖరితో ఉంది. ఎన్టీఆర్‌కు సంబంధించి పలు అంశాలపై కూడా టీఆర్ఎస్ గతంలో పలుమార్లు సానుకూలంగా స్పందించిన సందర్భాలున్నాయి. అయితే రాజకీయంగా టీఆర్ఎస్ వ్యూహాం మరేదైనా ఉందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఓ సామాజిక వర్గానికి చేరువయ్యేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతుందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన నేతలకే టీఆర్ఎస్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ఎన్టీఆర్ శతజయంతి హైదాబాద్, ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుక‌కు టీఆర్ఎస్‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు కూడా హాజ‌రుకానున్నట్టు తెలిసింది.

Also Read : తెలుగు జాతి చైతన్యం ఎన్టీఆర్: బాలయ్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్