Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ తో త‌మిళ డైరెక్ట‌ర్ భారీ చిత్రం నిజ‌మేనా?

ఎన్టీఆర్ తో త‌మిళ డైరెక్ట‌ర్ భారీ చిత్రం నిజ‌మేనా?

NTR-Another Big: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో కొమ‌రం భీమ్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించ‌డంతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చింది. దీంతో నెక్ట్స్ మూవీస్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. క్రేజీ డైరెక్ట‌ర్స్ తోనే సినిమాలు చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

ఆత‌ర్వాత కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయ‌నున్నారు. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డం.. దీనికి ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డం తెలిసిందే. ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న‌ట్టు స‌మాచారం. ఈ రెండు చిత్రాలు చేతిలో ఉండ‌గానే మ‌రో క్రేజీ మూవీకి ఎన్టీఆర్ ఓకే చెప్పార‌ని.. టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ.. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే.. కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్.

విసార‌నై, వ‌డాచెన్నై, అసుర‌న్ చిత్రాల‌తో ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అసుర‌న్ మూవీ అయితే.. జాతీయ స్థాయి పుర‌స్కారాన్ని అందుకుంది. ఈ డైరెక్ట‌ర్ తో ఎన్టీఆర్ మూవీ చేయ‌నున్నార‌ని.. వీరిద్ద‌రి మ‌ధ్య క‌థాచ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని స్టోరీ న‌చ్చ‌డంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఓ ప్ర‌ముఖ టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో తార‌క్ ని వెట్రిమార‌న్ ఎలా చూపిస్తారో అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సి వుంది.

Also Read : ఎన్టీఆర్ మూవీ రిలీజ్ డేట్.. లేటెస్ట్ న్యూస్. 

RELATED ARTICLES

Most Popular

న్యూస్