Saturday, March 14, 2026
Homeసినిమాఎన్టీఆర్ 30 లో డ్యూయర్ రోల్..?

ఎన్టీఆర్ 30 లో డ్యూయర్ రోల్..?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మూవీ అని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అఫిషియల్ గా ఈ మూవీని అనౌన్స్ చేశారు కానీ.. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చెప్పలేదు. ఒకానొక టైమ్ లో ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడంతో అసలు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందేమో అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఇటీవల ఈ ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుందని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి యంగ్ టైగర్ అభిమానులు ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే… ఈ మూవీ గురించి ఆరా తీస్తే.. అదిరిపోయే న్యూస్ తెలిసింది. మేటర్ ఏంటంటే.. ఈ సినిమా కథ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఎన్టీఆర్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ‘అదుర్స్’ మూవీలో ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టారు. ‘జై లవకుశ’ మూవీలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. ఇప్పుడు మళ్లీ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసినప్పటి నుంచి సినిమా పై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ఇందులో రెండు పాత్రలను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట కొరటాల శివ.

మరి..  ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అంటే.. డిసెంబర్ లేదా జనవరిలో ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని రూపొందించనున్నారు. జనతా గ్యారేజ్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన ఎన్టీఆర్, కొరటాల ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధించాలని పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నారు. 2023 దసరాకి ఈ మూవీని రిలీజ్ చేయాలనేది ప్లాన్. మరి.. ఈ పాన్ ఇండియా మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.

Also Read : ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో NTR 30.. మోష‌న్ పోస్టర్ విడుదల 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular