Saturday, March 14, 2026
Homeసినిమాబుచ్చిబాబుకు నో చెప్పిన ఎన్టీఆర్

బుచ్చిబాబుకు నో చెప్పిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా, బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలి అనుకున్నారు. బుచ్చిబాబు చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. ఇక అప్పటి నుంచి బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాను అంటూ కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. కొరటాలతో సినిమా తర్వాత ఎన్టీఆర్ బుచ్చిబాబుతో సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబుకు ఎన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ.. నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ తోనే అని అందరికీ నో చెప్పాడు.

అయితే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారింది. ఈమధ్య ఆస్కార్ బరిలో నిలవడంతో ఇంకా క్రేజ్ పెరిగింది. దీంతో ఎన్టీఆర్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇప్పటి నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యారట. అలాగే తన ఇమేజ్ కి తగ్గ కథలను ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఈ లెక్కన బుచ్చిబాబుతో సినిమా చేస్తే.. సెట్ కాదని.. తన ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమా తీయలేడని భావించాడో ఏమో కానీ.. బుచ్చిబాబును పిలిచి కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలి. ఆతర్వాత మనం కలుద్దాం అని చెప్పి పంపించాడట.

చేసేది ఏమీ లేక బుచ్చిబాబు ఇప్పుడు చరణ్ తో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడట. ఇటీవల చరణ్ కు కథ చెప్పాడని తెలిసింది. ఆయన పాజిటివ్ గా స్పందించాడని.. ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమన్నాడని టాక్. పాపం.. బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఎదురు చూసి చూసి రెండు సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. మరి.. చరణ్ అయినా సినిమా చేయడానికి ఎస్ అంటాడో నో అంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular